నెట్ ఫ్లిక్స్ లో సెన్సేషన్ రేపుతున్న మరో లేటెస్ట్ కొరియన్ సిరీస్.!

Published on Jan 30, 2022 3:34 pm IST

ప్రపంచ ప్రఖ్యాత స్ట్రీమింగ్ సంస్థల్లో దిగ్గజ ఓటిటి యాప్ నెట్ ఫ్లిక్స్ కూడా ఒకటి. భారీ స్థాయిలో బెస్ట్ క్వాలిటీ డిజిటల్ కంటెంట్ ఇక్కడ నుంచి దొరుకుంతుంది. మరి ఇదిలా ఉండగా వీరి నుంచి లేటెస్ట్ గా కొన్ని సిరీస్ లు గ్లోబల్ గా భారీ హిట్ అవుతున్నాయి. గత కొన్ని నెలల కితమే “స్క్విడ్ గేమ్” అనే సిరీస్ వచ్చి అన్ని దేశాల్లో కూడా సంచలనం రేపింది.

ఇక ఇప్పుడు దీని తర్వాత వీరు మరిన్ని కొరియన్ సిరీస్ లని తీసుకొస్తారని ఓటిటి వర్గాలు చెప్పాయి. మరి అందుకు తగ్గట్టుగానే వీరు తీసుకొచ్చిన మరో లేటెస్ట్ కొరియన్ సిరీస్ ఓటిటి లో సూపర్ హిట్ అయ్యి ఆ ఆడియెన్స్ లో హాట్ టాపిక్ గా నడుస్తుంది. ఆ సిరీస్ నే “ఆల్ ఆఫ్ అస్ ఆర్ డెడ్”.

ఒక డిఫరెంట్ జాంబీ టైప్ థ్రిల్లర్ డ్రామాగా కనిపించే ఈ సిరీస్ మళ్ళీ నెట్ ఫ్లిక్స్ లో ప్రపంచ అన్ని దేశాల్లో పెద్ద ఎత్తున హిట్ గా నిలిచిందట. గ్లోబల్ గా ట్రెండింగ్ నెంబర్ 1 లో నిలిచి ఇంకో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంతే కాకుండా చాలా మంది ఓటిటి వీక్షకులు కూడా ఈ సిరీస్ ని ఒకరికొకరు సజెస్ట్ చేస్తున్నారు. మొత్తం 12 ఎపిసోడ్స్ గా ఉన్న ఈ సిరీస్ ని నెట్ ఫ్లిక్స్ లో అయితే చూడొచ్చు.

సంబంధిత సమాచారం :