లేటెస్ట్..”జెంటిల్మెన్ 2″ కి లెజెండరీ మ్యూజిక్ కంపోజర్.!

Published on Jan 23, 2022 12:00 pm IST

డియన్ సినిమా దగ్గర తన సినిమాలతో ఒక స్పెషల్ మార్క్ ని సెట్ చేసుకొని మొత్తం దేశ వ్యాప్త టాప్ దర్శకుల్లో ఒకరిగా ఇండియన్ జేమ్స్ కెమరూన్ శంకర్ ఎదిగారు. మరి ఇప్పుడు శంకర్ సాలిడ్ లైనప్ తో బిజీగా ఉండగా తాను తీసిన సినిమాల్లో సెన్సేషనల్ హిట్ అయ్యిన వాటిలో అర్జున్ తో తీసిన సినిమా “జెంటిల్మెన్” కూడా ఒకటి.

మరి దాదాపు రెండు దశాబ్దాల కితం వచ్చిన ఈ సినిమాకి సీక్వెల్ ని కూడా ఆ చిత్ర నిర్మాత కే టి కుంజుమోన్ అనౌన్స్ చేశారు. అయితే ఈ అనౌన్సమెంట్ వచ్చి చాలా కాలం కాగా ఇప్పుడు దీనిపై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకి వచ్చింది. ఈ చిత్రానికి గాను మన టాలీవుడ్ లెజెండరీ సంగీత దర్శకులు అయినటువంటి ఎం ఎం కీరవాణి ని ఫిక్స్ చేసినట్టుగా కన్ఫర్మ్ అయ్యింది.

దీనిని నేరుగా ఆ సినిమా నిర్మాత కుంజుమోన్ నే కలిసి కీరవాణితో ఆ సినిమాకి కంపోజ్ చేసేందుకు ఒప్పించుకున్నారు. మరి ఈ సినిమాని కూడా భారీ స్థాయి పాన్ ఇండియన్ లెవెల్లోనే రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. మరి కీరవాణి పాన్ ఇండియన్ సినిమాలకు ఏ రేంజ్ గ్రాండియర్ సంగీతం ఇస్తారో బాహుబలి, ఇప్పుడు “RRR” లకి చూసాం. ఇక ఈ సినిమాకి ఏ లెవెల్లో ఇస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :