అన్ స్టాపబుల్ కి ఈ లెజెండరీ పర్సనాలిటీ!

Published on Sep 28, 2022 9:12 pm IST

ఆహా వీడియో ప్రారంభమైనప్పటి నుండి కొంత మంచి కంటెంట్‌ను అందిస్తోంది. ఓటిటి లో వారి అతిపెద్ద షోలలో ఒకటి నందమూరి బాలయ్యతో అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే. త్వరలో రెండో సీజన్ కూడా ప్రారంభం కానుందని మనందరికీ తెలిసిందే. ఇందుకు సంబంధించిన ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి.

తాజాగా రెండో సీజన్ కు లెజెండరీ పర్సనాలిటీ, మాజీ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు ముఖ్య అతిథిగా వ‌స్తాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి కానీ ఇంకా క‌న్ఫ‌ర్మేష‌న్ రాలేదు. అతను ఖచ్చితంగా షోలో కనిపిస్తాడని మరియు షోను మరింత ఆసక్తి గా మారుస్తాడని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. విడుదలైన ప్రత్యేక అంతెం కి ఇప్పటికే సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ షో కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :