‘జై బాలయ్య’ లో హైలైట్ గా అతడు కూడా..!

Published on Nov 26, 2022 7:01 am IST

ఇప్పుడు మన టాలీవుడ్ లో మంచి మ్యూజిక్ ఫెస్టివల్ నడుస్తుందని చెప్పాలి. బ్యాక్ టు బ్యాక్ ఒకే బ్యానర్ నుంచి రెండు సినిమాలు ఫస్ట్ సింగిల్స్ అందులోని ఇద్దరు టాప్ హీరోలు మెగాస్టార్, నటసింహం బాలయ్య ల నుంచి సాంగ్స్ వచ్చి అదరగొడుతున్నాయి. ఇక ఈరోజు బాలయ్య నటించిన చిత్రం “వీరసింహా రెడ్డి” నుంచి ఫస్ట్ సింగిల్ ని మేకర్స్ ఈరోజు రిలీజ్ చెయ్యగా ఇది కూడా ఇన్ స్టాంట్ చార్ట్ బస్టర్ అయ్యి భారీ రెస్పాన్స్ అందుకుంది.

అయితే ఈ సాంగ్ లో బాలయ్య మెయిన్ హైలైట్ కాగా మరో వ్యక్తి కోసం కూడా ఇపుడు మంచి టాక్ నడుస్తుంది. మరి అతను ఎవరో కూడా కాదు సాంగ్ కంపోజ్ చేసిన సంగీత దర్శకుడు థమన్. తన సినిమాల ప్రతి సాంగ్ కి మంచి ప్రమోషనల్ సాంగ్స్ ని ప్లాన్ చేసే థమన్ జై బాలయ్య కోసం కాస్త కొత్తగా మారి కనిపించడం సోషల్ మీడియాలో ఓ రేంజ్ టాపిక్ గా మారింది. దీనితో థమన్ తన కొత్త క్రేజీ లుక్ తో మంచి వైరల్ గా మారాడు.

జై బాలయ్య సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :