శ్రీకాంత్ అడ్డాల “పెద కాపు” మొత్తం ఇన్ని భాగాలుగా.?

Published on Jun 3, 2023 3:12 pm IST

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి పలువురు సెన్సిబుల్ డైరెక్టర్స్ లో తన మొదటి సినిమాలతోనే మంచి క్లాస్ హిట్స్ అందుకున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కూడా ఒకరు. మరి శ్రీకాంత్ అడ్డాల అలాంటి ఫ్యామిలీ అండ్ క్లాస్ సినిమాలు మాత్రమే కాదు వైలెంట్ యాక్షన్ డ్రామాలు కూడా చేయగలరని అయితే “నారప్ప” తో అందరికీ షాకిచ్చారు.

ఇక లేటెస్ట్ గా అయ్యితే ప్రముఖ నిర్మాణ సంస్థ ద్వారకా క్రియేషన్స్ లో “పెద కాపు 1” అనే ఊహించని సబ్జెక్టు తో అయితే మరింత షాక్ ఇవ్వగా ఇప్పుడు దీనిపై మరో బజ్ వినిపిస్తుంది. టైటిల్ లోనే 1 ఉంది కాబట్టి డెఫినెట్ గా ఈ చిత్రం భాగాలుగా వస్తుంది అని అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. కానీ ఎన్ని భాగాలు అనేది మాత్రం తెలియదు.

అయితే ఈ సినిమాని మొత్తం మూడు భాగాలుగా ప్లాన్ చేస్తున్నారు అంటూ కొన్ని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. మరి ఓ కొత్త హీరోతో మొత్తం మూడు భాగాల సినిమా అంటే కంటెంట్ పరంగా చాలా బలమైన ప్లాన్ తోనే వస్తుండాలని చెప్పాలి. మరి ఈ చిత్రం ఇన్ని భాగాల అంశంపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :