“అవతార్ 2” కి కేమరూన్ అందుకుంది ఎంతంటే.!

Published on Feb 14, 2023 4:02 pm IST

ప్రస్తుతం వరల్డ్ సినిమా దగ్గర భారీ వసూళ్లు కొల్లగొట్టిన మోస్ట్ అవైటెడ్ సినిమా “అవతార్ 2”. హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కేమరూన్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ విజువల్ ట్రీట్ వరల్డ్ వైడ్ గా గత డిసెంబర్ లో రిలీజ్ అయ్యి ఇప్పుడు దాదాపు 60 రోజులకి పైగా థియేట్రికల్ రన్ ని కంప్లీట్ చేసుకుంది.

ఇప్పటికీ కూడా వరల్డ్ వైడ్ అనేక ప్రాంతాల్లో సాలిడ్ రన్ ని ఈ సినిమా కొనసాగిస్తుండగా ఇంటర్నేషనల్ సినీ వర్గాల్లో అయితే జేమ్స్ కేమరూన్ ఈ సినిమాకి ఎంత మొత్తంలో లాభం పొందారో తెలుస్తుంది. ఈ సినిమా నిర్మాణంలో కూడా కేమరూన్ కి భాగం ఉన్న సంగతి తెలిసిందే.

మరి ఈ క్రమంలో రిలీజ్ అయ్యి టార్గెట్ ని రీచ్ అయ్యిన ఈ సినిమా లాభాలతో తాను 95 మిలియన్ డాలర్స్ అయితే అందుకున్నారట. దీనితో వరల్డ్ లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ అందుకున్న డైరెక్టర్ గా అయితే తాను నిలిచారు. ఇక రీసెంట్ గానే తన టైటానిక్ మళ్ళీ రిలీజ్ ఇది కూడా భారీ వసూళ్లు రాబట్టింది.

సంబంధిత సమాచారం :