“ఆచార్య”లో రామ్ చరణ్ నిడివిపై మరింత క్లారిటీ.!

Published on Dec 2, 2021 7:00 am IST

మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెగా తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో కీలక పాత్రలో బ్లాక్ బస్టర్ దర్సకుడి కొరటాల శివ తెరకెక్కించిన లేటెస్ట్ హై బడ్జెట్ చిత్రం “ఆచార్య”. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ మెగా మల్టీస్టారర్ చిత్రంకి మొదటి నుంచీ కాస్త ఆసక్తికర మార్పులే జరిగాయి.

మొదట్లో చరణ్ పాత్ర చాలా చిన్నది పైగా అందుకు వేరే స్టార్ హీరో పేరులు కూడా రేస్ లోకి వచ్చాయి. అదే సస్పెన్స్ కొన్ని నెలల పాటు కొనసాగి లాస్ట్ కి చరణ్ దగ్గర ఫిక్స్ అయ్యింది. అయితే కథానుసారం చరణ్ పాత్ర క్యామియో నుంచి సినిమాలోని ఇంకో కీలక పాత్రగా మారిందని కొరటాల ఇంతకు ముందు ఎప్పుడో సెలవిచ్చారు.

మరి అక్కడ నుంచి చరణ్ పాత్ర సినిమాలో ఎంతసేపు ఉంటుంది అనేది కూడా కీలక అంశంగా మారింది. అయితే ఇప్పుడు దీనిపై మరింత క్లారిటీ బయటకి వచ్చింది. సినిమాలో చరణ్ పాత్ర సెకండాఫ్ లో ఎంటర్ అయ్యి దాదాపు 40 నిమిషాల నిడివితో ఉంటుందట. ఈ 40 నిమిషాలు కూడా సినిమాకి అత్యంత కీలకం అని తెలుస్తుంది.

ఇక ఈ ఇద్దరు స్టార్ హీరోల సరసన కాజల్ అగర్వాల్ మరియు పూజా హెగ్డే లు నటించగా మణిశర్మ సంగీతం అందించారు. అలాగే మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :