తెలుగులో విజయ్ “గోట్” ని ఇంత మొత్తంతో కొన్నార?

తెలుగులో విజయ్ “గోట్” ని ఇంత మొత్తంతో కొన్నార?

Published on Jul 9, 2024 7:01 AM IST

దళపతి విజయ్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న అవైటెడ్ భారీ చిత్రమే “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం”. మరి షార్ట్ కట్ లో గోట్ గా పిలవబడుతున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ సాలిడ్ బిజినెస్ ని లాక్ చేసుకుంటుండగా తెలుగులో కూడా బిజినెస్ ని పూర్తి చేసుకుంది. మరి మన తెలుగులో ఈ చిత్రం ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ వారు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

మరి నిన్ననే ఇది రివీల్ అయ్యింది. మరి తెలుగులో ఈ సినిమాకి ఎంత మొత్తం చెల్లించారో తెలుసా? ఈ సినిమాకి వారు సుమారు 25 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నారట. మరి ఇది దాదాపు విజయ్ గత చిత్రం “లియో” బిజినెస్ తో సమానం అనే చెప్పాలి. ఇక ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు అలాగే ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మాణం వహిస్తుండగా ఈ సెప్టెంబర్ 5 న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి తీసుకొస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు