బుచ్చిబాబు – ఎన్టీఆర్ సినిమా పై క్రేజీ బజ్!

Published on Apr 19, 2022 9:06 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ రౌద్రం రణం రుధిరం చిత్రం సక్సెస్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ లైనప్ లో చాలా మంచి సినిమాలే ఉన్నాయి. అయితే ఇందులో బుచ్చిబాబు తో చేస్తున్న సినిమా పై ఆసక్తి నెలకొంది. ఉప్పెన చిత్రం తో ఫ్రెష్ కంటెంట్ తో ఇండస్ట్రీ కి పరిచయమైన ఈ దర్శకుడు ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశం కొట్టేశాడు. అయితే ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

తాజాగా మరోసారి దీని పై ఫిల్మ్ ఇండస్ట్రీ లో చర్చలు జరుగుతున్నాయి. ఈ చిత్రం కోసం ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు అనేది తెలుస్తోంది. దీని పై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :