విజయ్ సమంత ల చిత్రానికి ఈ సంగీతం దర్శకుడు?

Published on Apr 20, 2022 7:55 pm IST

విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో యూత్ లో విశేష ఆదరణ పొందుతున్న హీరో. అర్జున్ రెడ్డి చిత్రం తో క్రేజ్ సొంతం చేసుకున్న ఈ యంగ్ హీరో ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ తో పాటుగా, జన గణ మన చిత్రం ను చేస్తున్నారు. విజయ్ దేవరకొండ లైనప్ లో చాలా మంది డైరక్టర్ లు ఉన్నారు. అందులో శివ నిర్వాణ ఒకరు.

శివ నిర్వాణ దర్శకత్వం లో ఇంటెన్స్ లవ్ స్టోరీ లో హీరో నటిస్తున్నారు. ఈ చిత్రం లో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా సమంత రుతు ప్రభు నటిస్తుంది. వీరిద్దరూ ఇది వరకే మహానటి చిత్రం కోసం కలిసి పని చేశారు. అయితే ఈ సారి ఫుల్ లెంగ్త్ లవ్ స్టోరీ కోసం మెయిన్ లీడ్స్ లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి హృదయం చిత్రానికి సంగీతం అందించిన హేశం అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం గతం లో మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన రోజా చిత్రం తరహా ఇంటెన్స్ లవ్ స్టొరీ తో పాటుగా, డ్రామా ఉండే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :