“సలార్” శాటిలైట్ హక్కులు సొంతం చేసుకున్న ఆ ఛానెల్?

Published on Oct 7, 2022 12:00 pm IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “సలార్” కూడా ఒకటి. మరి దీనిపై తారా స్థాయి అంచనాలు నెలకొనగా షూటింగ్ ని కూడా మేకర్స్ అయితే శరవేగంగా కంప్లీట్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా పై అయితే ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుస్తుంది.

ఈ చిత్రం తాలుకా శాటిలైట్ హక్కులు తెలుగు వరకు ఓ ప్రముఖ ఛానెల్ భారీ మొత్తం చెల్లించి కొనుగోలు చేశారట. మరి ఈ ఛానెల్ అయితే స్టార్ మా సంస్థ వారు అన్నట్టు తెలుస్తుంది. ఆల్ మోస్ట్ పాన్ ఇండియా సినిమాలు తెలుగు నుంచి వస్తున్నవి వీరే కొంటుండడం విశేషం. ఇక దీనిపై అయితే అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో అయితే హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుండగా రవి బసృర్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే హోంబళే ఫిలిమ్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :