“రామారావు ఆన్ డ్యూటీ” ఓటిటి స్ట్రీమింగ్ ఎందులో అంటే.!

“రామారావు ఆన్ డ్యూటీ” ఓటిటి స్ట్రీమింగ్ ఎందులో అంటే.!

Published on Jul 29, 2022 3:33 PM IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ సినిమా “రామారావు ఆన్ డ్యూటీ” తో ఈ ఏడాదిలో రెండోసారి ఆడియెన్స్ ని పలకరించడానికి వచ్చారు. నూతన దర్శకుడు శరత్ మండవ తో రవితేజ చేసిన ఈ చిత్రం మంచి ప్రమోషన్స్ మరియు అంచనాలు మధ్య ఈ రోజు థియేటర్స్ లోకి వచ్చింది. ఇక ఈ చిత్రం కి ఓవర్సీస్ సహా తెలుగు రాష్ట్రాల్లో కూడా డీసెంట్ ఓపెనింగ్స్ కనబడుతుండగా ఈ సినిమా ఓటిటి డీల్ పై అయితే క్లారిటీ వచ్చింది.

ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటిటి స్ట్రీమింగ్ యాప్ సోనీ లివ్ వారు కొనుగోలు చేసినట్టు కన్ఫర్మ్ అయ్యింది. మరి దీనితో అయితే కొన్ని వారాల తర్వాత ఈ సినిమాలో ఓటిటి లో రిలీజ్ కానుంది. ఆలోపు వరకు థియేట్రికల్ గా ఈ సినిమాని ఎంజాయ్ చెయ్యాల్సిందే. ఇక ఈ చిత్రంలో దివ్యాన్షా కౌశిక్ హీరోయిన్ గా నటించగా సామ్ సి ఎస్ సంగీతం అందించాడు. అలాగే ఎస్ ఎల్ వి సినిమాస్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు