“దళపతి 68” కి ఫ్రంట్ రేస్ లో ఈ ఓటిటి సంస్థ?

Published on Sep 15, 2023 12:00 pm IST

ప్రస్తుతం ఇళయ దళపతి బిజె జోసెఫ్ హీరోగా త్రిష హీరోయిన్ గా దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో భారీ చిత్రం “లియో” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం తర్వాత అయితే విజయ్ తన కెరీర్ లో 68వ చిత్రాన్ని దర్శకుడు వెంకట్ ప్రభుతో భారీ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. మరి ఇప్పటికే ఈ సినిమా అదిరే హైప్ ని సెట్ చేసుకోగా ఈ చిత్రం కోసం అంతా ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు.

మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం విషయంలో ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. ఇక ఈ చిత్రం ఓటిటి డీల్ విషయంలో దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు అయితే ఫ్రంట్ రేస్ లో ఈ సినిమా హక్కులు దక్కించుకోవడానికి రెడీగా ఉన్నారని బజ్ వినిపిస్తుంది. మరి ఇందు కోసం వారు రికార్డు మొత్తంలో ఆఫర్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా అతి త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసుకోనుంది.

సంబంధిత సమాచారం :