ఈ పాన్ ఇండియా సినిమాకి సరిపోని హైప్?

Published on Mar 12, 2023 8:02 pm IST


ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర మన దక్షిణాది సినిమా నుంచే అనేక సినిమాలు ఆల్ మోస్ట్ భారీ ఎత్తున విడుదల అవుతున్నాయి. అయితే వీటిలో అధికంగా తెలుగు మరియు కన్నడ భాషలు నుంచి వెళ్తున్నాయి. అయితే కన్నడ నుంచి గత కొన్ని నెలల కితం ఓ రేంజ్ లో హైప్ ని రేపిన సినిమా ఏదన్నా ఉంది అంటే ఆ చిత్రం ఉపేంద్ర హీరోగా నటించిన భారీ చిత్రం “కబ్జ” అనే చెప్పుకోవాలి.

దర్శకుడు ఆర్ చంద్రు తెరకెక్కించిన ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ టీజర్ మళ్ళీ కేజీయఫ్ తరహా ట్రీట్ ఖాయం అన్నట్టుగా సెన్సేషన్ ని రేపింది. అయితే ఈ భారీ సినిమా ఇప్పుడు మరికొన్ని రోజుల్లో మాత్రమే రిలీజ్ కి రాబోతుంది. కానీ అప్పటికీ ఇప్పటికీ ఈ సినిమా మీద ఉన్న హైప్ చాలా తక్కువని చెప్పాలి.

ప్రస్తుతానికి మేకర్స్ ప్రమోషన్స్ చేస్తున్నప్పటికీ ట్రైలర్ రిలీజ్ లో సరైన ప్లానింగ్ లేకపోవడం ఇతర కొన్ని కారణాలతో అయితే ఆడియెన్స్ మరీ అంత ఎగ్జైటెడ్ గా ఈ సినిమా పట్ల ఉన్నట్టు కనిపించడం లేదు. దీనితో కన్నడ మినహా మిగతా ఎక్కడా కూడా భారీ ఓపెనింగ్స్ నమోదు చేసే అవకాశం లేదనే అనుకోవాలి. మరి ఈ కొన్ని రోజుల్లో ఏమన్నా మార్పు వస్తుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :