“వారణాసి”లో ఆ ఎపిసోడ్ అంతా మైండ్ బ్లాక్!

Varanasi

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రియాంకా చోప్రా జోనస్ ఫీమేల్ లీడ్ లో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ సినిమానే వారణాసి. అత్యున్నత ప్రమాణాలతో భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు రోజుకో క్రేజీ న్యూస్ బయటకి వస్తుంది. అలా లేటెస్ట్ గా మరో టాక్ ఇప్పుడు బయటకి వచ్చింది.

అయితే ఈ సినిమా కాన్సెప్ట్ టీజర్ అందరికీ గుర్తుందిగా అందులో చూపిన కొన్ని క్రేజీ అంశాల్లో ఉగ్రభట్టి గుహ విజువల్స్ కూడా ఒకటి. అయితే ఈ పర్టిక్యులర్ ఎపిసోడ్ మొత్తం నెక్స్ట్ లెవెల్లో వర్క్ అవుతుంది అని తెలుస్తోంది. బిగ్ స్క్రీన్స్ పై ఈ ఎపిసోడ్ అందిస్తుందట. సో రాజమౌళి ఈ సీక్వెన్స్ తో తాండవం చూపిస్తారని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాని కార్తికేయ, కే ఎల్ నారాయణలు నిర్మాణం వహిస్తుండగా ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version