చరణ్ నెక్స్ట్ గా ఈ భారీ ప్రాజెక్ట్ ఆల్ మోస్ట్ ఫిక్స్.!

చరణ్ నెక్స్ట్ గా ఈ భారీ ప్రాజెక్ట్ ఆల్ మోస్ట్ ఫిక్స్.!

Published on Nov 22, 2022 10:00 AM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇప్పుడు మావెరిక్ దర్శకుడు శంకర్ తో ఓ భారీ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి దీనిపై అయితే పాన్ ఇండియా లెవెల్లో భారీ స్థాయి అంచనాలు నెలకొనగా చరణ్ నెక్స్ట్ సినిమా ఎవరితో ఉంది అనేది గత కొన్ని వారాల నుంచి ఆసక్తిగా మారింది. చరణ్ అయితే నెక్స్ట్ నిజానికి దర్శకుడు టాలెంటెడ్ ఫిలిం మేకర్ గౌతమ్ తిన్ననురితో చేయాల్సి ఉంది.

కానీ ఆ ప్రాజెక్ట్ అయితే ఆగిపోయింది. ఇక నెక్స్ట్ ఓ కన్నడ దర్శకుడు లైన్ లోకి వచ్చాడని కూడా బజ్ వచ్చింది. కానీ ఇప్పుడు లేటెస్ట్ టాక్ ప్రకారం చరణ్ ని శంకర్ తర్వాత డైరెక్ట్ చేయనుంది దర్శకుడు సుకుమార్ ప్రియ శిష్యుడు బుచ్చిబాబు సానా అన్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ కాంబినేషన్ ఆల్ మోస్ట్ ఫిక్స్ కాగా దీనిని కూడా భారీ ప్రాజెక్ట్ గా ప్లాన్ చేయనున్నారట. అయితే దీనిపై అధికారిక అనౌన్సమెంట్ రావాల్సి ఉంది..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు