“పుష్ప”లో బన్నీ నట విశ్వరూపంపై విలక్షణ దర్శకుడి ప్రశంసల జల్లు.!

Published on Jan 8, 2022 10:11 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ భారీ సినిమా “పుష్ప ది రైజ్”. తన హ్యాట్రిక్ దర్శకుడు సుకుమార్ తో తీసిన ఈ భారీ సినిమా నిన్ననే ఓటిటి లో రిలీజ్ అయ్యింది. థియేటర్స్ లో రిలీజ్ అయ్యిన కొన్ని రోజులకే వచ్చినా పుష్ప హవా మాత్రం తగ్గలేదు. అయితే ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన లైఫ్ టైం పెర్ఫామెన్స్ ని ఇచ్చాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

దర్శకుడు సుకుమార్ బన్నీ ని ఈ సినిమాలో ప్రెజెంట్ చేసిన విధానంకే అందరూ ఫిదా అయ్యారు. మరి ఇప్పుడు తాజాగా ఓ విలక్షణ దర్శకుడు పుష్ప సినిమాపై మరియు ఈ సినిమాలో బన్నీ నటనపై ఆసక్తికర కామెంట్స్ చేయడం జరిగింది. ఆ దర్శకుడే కోలీవుడ్ కి చెందిన సెల్వ రాఘవన్. ఈయన సినిమాలు కూడా ఎంత రియలిస్టిక్ గా ఉంటాయో అందరికీ తెలిసిందే.

ఇప్పుడు పుష్ప మూవీ చూసి ప్రశంసల జల్లు కురిపించారు. పుష్ప సినిమా అదిరిపోయిందని, సుకుమార్ కోసం ఎంత చెప్పినా తక్కువే ప్రతి పాత్ర టెర్రిఫిక్ పెర్ఫామెన్స్ ని అందించారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ తో అయితే అడిక్ట్ అయ్యిపోయాను బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది.

ఇక అల్లు అర్జున్ పెర్ఫామెన్స్ అదిరే లెవెల్లోకి ఉందని తన బాడీ లాంగ్వేజ్, తన నటన మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయని సెల్వ రాఘవన్ చాలా ఎగ్జైటింగ్ గా రెస్పాన్స్ ని తెలిపారు. ఇలాంటి దర్శకునికే పుష్ప సినిమా ఈ రేంజ్ లో నచ్చింది అంటే పుష్ప సినిమా అందుకున్న విజయం ఏ స్థాయిదో చెప్పక్కర్లేదు.

సంబంధిత సమాచారం :