సీడెడ్, ఈస్ట్, నెల్లూరులో ఈ సంక్రాంతి సినిమా ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డు!

sankranthi-movies

ఈ ఏడాది సంక్రాంతి(Sankranthi) కానుకగా థియేటర్స్ లో ఆడియెన్స్ ముందుకు అలరించేందుకు వచ్చిన లేటెస్ట్ చిత్రాలు కొన్ని ఉన్నాయి. మరి వీటిలో యూనానిమస్ గా సాలిడ్ వసూళ్లు అందుకున్న సినిమాలలో మెగాస్టార్ చిరంజీవి అనీల్ రావిపూడి కలయికలో వచ్చిన చిత్రం మన శంకర వరప్రసాద్ గారు కూడా ఒకటి. అయితే ఈ సినిమా ఆల్రెడీ వరల్డ్ వైడ్ వసూళ్లతో రీజనల్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచినట్టు మేకర్స్ ప్రకటించారు.

ఇక ఈ సినిమా ఏపీలో కొన్ని ముఖ్య ఏరియాల్లో ఏకంగా ఆల్ టైం రికార్డు షేర్లు రాబట్టిన సినిమాగా (రీజనల్) నిలిచినట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు. అవే సీడెడ్, నెల్లూరు ఇంకా తూర్పు గోదావరి జిల్లాలలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా మెగాస్టార్ చిత్రం నిలిచింది. దీనితో ఈ సినిమా ర్యాంపేజ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించగా వెంకీ మామ సాలిడ్ క్యామియో రోల్ చేశారు. అలాగే నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని సుష్మిత కొణిదెల, సాహు గారపాటి నిర్మాణం వహించారు.

Exit mobile version