వైరల్ : హ్యాట్రిక్ కి సిద్ధం అవుతున్న సెన్సేషనల్ కాంబో.?

Published on Jun 30, 2022 1:55 pm IST


ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో మంచి అంచనాలతో రిలీజ్ కి సిద్ధంగా ఉన్న పలు చిత్రాల్లో దర్శకుడు పూరి జగన్నాథ్ మరియు రౌడీ హీరోల నుంచి వస్తున్న భారీ యాక్షన్ చిత్రం “లైగర్” కూడా ఒకటి. మరి ఈ సినిమా తర్వాత మళ్ళీ ఈ సెన్సేషనల్ కాంబో పూరి తో “జనగణమన” అనే స్ట్రాంగ్ సబ్జెక్టు ని రెండో సినిమాగా టేకప్ చేసారు. అయితే ఇది ఇంకా షూటింగ్ లోనే ఉండగా ఈ క్రేజీ కాంబో నుంచి హ్యాట్రిక్ ప్రాజెక్ట్ చేయడానికి రంగం సిద్ధం అయ్యినట్టుగా తెలుస్తుంది.

ఆల్రెడీ ఈ కాంబో నుంచి మూడో సినిమాని ఇద్దరూ లాక్ చేసేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం విజయ్ జనగణమన అలాగే ఖుషి సినిమాలతో బిజీగా ఉండగా వీటి తర్వాత వెంటనే ఈ సినిమా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్ మంచి వైరల్ అవుతుంది. అయితే ఈ హ్యాట్రిక్ రీ యూనియన్ పై మాత్రం ఇంకా సరైన క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే లైగర్ ప్రమోషన్స్ లో ఈ టీం అంతా బిజీగా ఉన్నారు.

సంబంధిత సమాచారం :