“జవాన్” లో ఈ సీక్వెన్స్ అదిరిపోతుందట.!

Published on Feb 16, 2023 12:01 pm IST

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “పఠాన్” తో తాను సెన్సేషనల్ కం బ్యాక్ ని అయితే అందుకున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా హిట్ తో తన నెక్స్ట్ సినిమాలపై మరిన్ని అంచనాలు మరియు హైప్ లు నెలకొన్నాయి. అలా నెక్స్ట్ జూన్ లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమానే “జవాన్”. కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై కూడా క్రేజీ హైప్ నెలకొనగా దర్శకుడు అట్లీ అయితే ఈ సినిమాని తన మార్క్ సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ లతో చేస్తున్నాడట.

మరి వీటిలో పలు స్టన్నింగ్ యాక్షన్ సీక్వెన్స్ లు చాలా కొత్తగా ఉంటాయట. అలాగే సాహో క్లైమాక్స్ తరహాలో కంప్లీట్ దుమ్ము లో ఓ ఇంట్రెస్టింగ్ ఫైట్ సీక్వెన్స్ ఉంటుందని తెలుస్తుంది. ఇది డెఫినెట్ సినిమాలో బిగ్గెస్ట్ హైలైట్స్ లో ఒకటి అవుతుందని టాక్. మరి అట్లీ అయితే షారుఖ్ ని ఎలా ప్రెజెంట్ చేస్తున్నాడో చూడాలి. అలాగే ఐకాన్ స్టార్ కూడా ఓ సాలిడ్ క్యామియో లో నటిస్తున్నట్టూ రూమర్స్ ఉన్నాయి.

సంబంధిత సమాచారం :