విజయ్ “వారసుడు” స్టోరీపై అవి ఫేక్ వార్తలు..?

Published on Jul 6, 2022 11:00 pm IST

కోలీవుడ్ లో ఉన్నటువంటి బిగ్గెస్ట్ స్టార్ హీరోలలో ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ కూడా ఒకడు. మరి ఇప్పుడు విజయ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ సినిమా “వారసుడు” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం తమిళ్ లో “వరిసు” గా ఏకకాలంలో తెరకెక్కుతుంది.

అయితే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు ఇతర అప్డేట్స్ మంచి అంచనాలు నెలకొల్పగ ఇప్పుడు తాజాగా ఈ సినిమా స్టోరీ పై కొన్ని రూమర్స్ వైరల్ గా మారాయి. ఈ సినిమా కథ సేమ్ “అజ్ఞ్యాతవాసి”, “సాహూ” లలానే ఉంటుంది అని తన తండ్రి సామ్రాజ్యాన్ని కాపాడటానికి రహస్యంగా దాచిన వారసుడు మరో విజయ్ వస్తాడని పలు రూమర్స్ వినిపిస్తున్నాయి.

అయితే ఇవన్నీ ఫేక్ వార్తలే అని చెప్పాలి. ఆల్రెడీ రెండు సార్లు వచ్చిన సినిమాని మళ్ళీ మూడోసారి చేసే ప్రయత్నం చేస్తారా ఎవరైనా? అందులోని దిల్ రాజు లాంటి ప్రొడ్యూసర్ మళ్ళీ అలాంటి సబ్జెక్ట్ ని తెరకెక్కిస్తున్నారని నమ్ముతున్నారు అంటే అది అవివేకమే అవుతుంది. సో ఈ వార్తల్లో మాత్రం ఎలాంటి నిజం లేదని చెప్పాలి.

సంబంధిత సమాచారం :