హాట్ టాపిక్ గా “రావణాసుర” ట్రైలర్ లో ఈ షాట్.!

Published on Mar 29, 2023 4:34 pm IST

మన టాలీవుడ్ మోస్ట్ లవబుల్ హీరోస్ లో ఒకరైన మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మరో అవైటెడ్ సినిమానే “రావణాసుర”. ధమాకా, వాల్తేరు వీరయ్య లాంటి రెండు బ్యాక్ టు బ్యాక్ సెన్సేషనల్ హిట్స్ తర్వాత వస్తున్న సినిమా ఇది కావడంతో దీనిపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ అంచనాలు అయితే నిన్న సినిమా ట్రైలర్ చూసాక మరింత ఎక్కువ అయ్యాయని చెప్పాలి.

అయితే ఈ ట్రైలర్ లో దర్శకుడు సుధీర్ వర్మ ఇంట్రెస్టింగ్ టేకింగ్ ఆడియెన్స్ ని ఆకట్టుకోగా మెయిన్ గా అయితే ఓ షాట్ చాలా మందికి విపరీతంగా నచ్చేసింది. అదే ట్రైలర్ లాస్ట్ లో సగం జోకర్ పోస్టర్ లో సగం రవితేజ ముఖాన్ని కలిపి చూపించిన షాట్ అని చెప్పాలి. దీనితో ఇది చూసిన ఫ్యాన్స్ అయితే మరింత కేజ్రీగా ఫీల్ అవుతున్నారు దీనితో ఈ పర్టిక్యులర్ షాట్ మాత్రం హాట్ టాపిక్ గా మారింది.. అలాగే ఈ సినిమాతో కూడా రవితేజ హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు అనే నమ్మకం కూడా అందరిలో వచ్చేసింది. మరి ఈ సినిమాకి ఏమవుతుందో ఈ ఏప్రిల్ 7 వరకు ఆగి చూడాల్సిందే.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :