టాక్..”భీమ్లా నాయక్” లో ఈ హిట్ సాంగ్ ఉండదా..?

Published on Feb 14, 2022 6:08 pm IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్న సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “భీమ్లా నాయక్” కోసం అందరికీ తెలిసిందే. మంచి అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రాన్ని మేకర్స్ ఇప్పుడు ఈ చిత్రాన్ని రిలీజ్ కి సిద్ధం చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. మరి ఇప్పుడు పాటలకి సంబంధించి అప్డేట్స్ నడుస్తుండగా ఇంకో ఇంట్రెస్టింగ్ బజ్ ఈ చిత్రంపై వినిపిస్తుంది.

సంగీత దర్శకుడు థమన్ ఆల్రెడీ ఈ చిత్రానికి కొన్ని హిట్ ట్రాక్స్ ఇచ్చి పవన్ కి మరో మంచి ఆల్బమ్ ని అందించాడు. అయితే ఇపుడు ఓ సాంగ్ ని సినిమాలో కనిపించకపోవచ్చు అని టాక్ వినిపిస్తుంది. అలాగే ఆ సాంగ్ కూడా మంచి మెలోడీ గా పేరు తెచ్చుకున్న సాంగ్ “అంత ఇష్టం” అట. దీనిపై మొదటి నుంచి కూడా కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి కానీ ఇప్పుడు అయితే దాదాపు ఈ సాంగ్ ఉండదనే వినిపిస్తుంది. మరి వేచి చూడాలి దీనిపై ఏమన్నా క్లారిటీ వస్తుందో లేదో అనేది.

సంబంధిత సమాచారం :