ఇంకా “భీమ్లా నాయక్” కంట్రోల్ లోనే ఈ రికార్డ్!

Published on Oct 14, 2021 11:00 pm IST


ఇప్పుడు మన టాలీవుడ్ సినిమాల్లో వాటి తాలూకా పాటలే సగం ఆ సినిమా మీద హైప్ ని ఆడియెన్స్ లో తీసుకొచ్చేస్తున్నాయి. వాటిలో లేటెస్ట్ గా అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మాస్ చిత్రం “భీమ్లా నాయక్” నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ కూడా ఒకటి. దీనికి అయితే భారీ రెస్పాన్స్ వచ్చి ఇప్పటికీ దీని 24 గంటల రికార్డు చెక్కు చెదరకుండా నిలిచిపోయింది. 24 గంటల్లో అత్యధిక లైక్స్ సాధించిన సాంగ్ గా భీమ్లా నాయక్ లిరికల్ సాంగ్ ఇప్పటికీ ఉంది.

నిన్న రిలీజ్ అయ్యిన పుష్ప సెకండ్ సింగిల్ శ్రీవల్లి చాలా అంచనాలతో వచ్చింది కానీ అది కూడా మిస్ కావడంతో ఈ రికార్డు ఇంకా భీమ్లా ఖాతాలోనే ఉంది. ఇక రేపు భీమ్లా నాయక్ నుంచి రెండో సాంగ్ “అంత ఇష్టం” రాబోతుంది. అదైనా మరి భీమ్లా ముందు రికార్డునే బ్రేక్ చేస్తుందో లేదో అన్నది వేచి చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటెర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :