“ఆర్ఆర్ఆర్” తర్వాత జపాన్ లో రిలీజ్ కి రెడీ అయిన మరో సౌత్ మూవీ!

“ఆర్ఆర్ఆర్” తర్వాత జపాన్ లో రిలీజ్ కి రెడీ అయిన మరో సౌత్ మూవీ!

Published on Oct 29, 2022 1:41 AM IST


భారతీయ చిత్రాలు విదేశాల్లో మంచి ఆదరణ ను సొంతం చేసుకుంటున్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆర్ ఆర్ ఆర్ మూవీ జపాన్ లో రిలీజై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. జక్కన్న రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా క్రేజ్ రోజురోజుకీ పెరిగిపోతోంది. అయితే థలపతి విజయ్ ఫ్యాన్స్ కి మరో అదిరిపోయే న్యూస్ ఏంటంటే, 2021 లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన మాస్టర్ చిత్రం జపాన్ లో రిలీజ్ కి రెడీ అయ్యింది.

తమిళనాట సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ చిత్రం నవంబర్ 18, 2022 లో జపాన్ లో రిలీజ్ కానుంది. లోకేష్ కనగరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటించగా, విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించడం జరిగింది. ఎక్స్‌బి ఫిల్మ్ క్రియేటర్స్ మరియు సిల్వర్ స్క్రీన్ స్టూడియో నిర్మించిన ఈ బ్లాక్ బస్టర్ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు