“హరిహర వీరమల్లు” జాయిన్ అయ్యిన స్టార్ యాక్టర్.!

“హరిహర వీరమల్లు” జాయిన్ అయ్యిన స్టార్ యాక్టర్.!

Published on Dec 24, 2022 12:00 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “హరిహర వీరమల్లు” కోసం తెలిసిందే. మరి పవన్ నుంచి వస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా కావడం దీనిపై మరిన్ని అంచనాలు నెలకొనగా ఈ చిత్రం మరింత ప్రతిష్టాత్మకంగా అయితే మారుతూ వస్తుంది. ఇక ఈ చిత్రంలో అయితే అనేక బాలీవుడ్ స్టార్స్ నటించనున్న సంగతి తెలిసిందే.

మరి లేటెస్ట్ గా మేకర్స్ అయితే బాలీవుడ్ ప్రముఖ స్టార్ యాక్టర్ బాబీ డియోల్ కి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. మరి దీనిపై ఓ ఇంట్రెస్టింగ్ వీడియో ని అయితే మేకర్స్ రిలీజ్ చేయగా కీరవాణి సాలిడ్ స్కోర్ ఇది మరింత ఎగ్జైటింగ్ గా కూడా ఉందని చెప్పాలి. మరి తాను ఈ చిత్రంలో ఎలాంటి పాత్రలో కనిపిస్తారో దర్శకుడు క్రిష్ ఎలా ప్రెజెంట్ చేస్తారో అనేది వేచి చూడాలి. ఇక ఈ చిత్రం భారీ యాక్షన్ సహా విజువల్స్ తో ఏ ఎం రత్నం పవన్ కెరీర్ లో నిలిచిపోయే సినిమాల నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు