కరోనా కాదు ఒమిక్రాన్ నుంచి కోలుకున్న స్టార్ నటుడు.!

Published on Jan 19, 2022 8:03 am IST


మన దేశంలో కరోనా మూడో వేవ్ తీవ్రత ఎలా ఉందో చూస్తూనే ఉన్నాము. అయితే గత రెండో వేవ్ తరహాలో భారీ స్థాయి ప్రాణ నష్టం లేదు కానీ కేసులు మాత్రం భారీ స్థాయిలో పెరగడం కాస్త ఆందోళనగా అనిపిస్తుంది. అలాగే ఇంకో పక్క ఈసారి అధికంగా అనేక మంది సినీ తారలు కరోనా బారిన పడడం షాక్ ఇచ్చింది. అందులోని మన దక్షిణాది సినిమా నుంచే ఎక్కువ మంది పాజిటివ్ గా వచ్చారు.

అయితే ఇక్కడ గుడ్ న్యూస్ ఏమిటంటే చాలా మంది తిరిగి రికవర్ అవుతుండడం. మరి నిన్ననే స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కోలుకోగా తాజాగా మరో స్టార్ నటుడు కోలుకున్నట్టు తెలిపాడు. అతడే విష్ణు విశాల్. గత కొన్ని రోజులు కోటమే విష్ణు తాను కరోనా పాజిటివ్ అయ్యినట్టు తెలిపాడు. కానీ ఇప్పుడు తాను కరోనా కాదు ఒమిక్రాన్ కి గురైనట్టు తెలిపాడు.

మరి దాని నుంచి కూడా ఇప్పుడు కోలుకున్నట్టు తెలిపాడు. ఈ పది రోజులు కాస్త కష్టంగానే అనిపించింది, ఇప్పటికీ కాస్త అలసట గానే ఉంది కానీ త్వరలోనే దీని నుంచి కూడా బయటపడతానని చెప్పుకొచ్చాడు. మరి ఇప్పుడు విష్ణు పలు తమిళ్
సినిమాలతో పాటుగా రవితేజ తో కూడా ఒక సినిమాలో నటించనున్నాడని తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :