బిగ్ బాస్ 5..ఆ స్టార్ కంటెస్టెంట్ అందరికీ ఆన్సర్ ఇచ్చినట్టేనట

బిగ్ బాస్ 5..ఆ స్టార్ కంటెస్టెంట్ అందరికీ ఆన్సర్ ఇచ్చినట్టేనట

Published on Oct 27, 2021 8:00 AM IST


ప్రస్తుతం తెలుగు స్మాల్ స్క్రీన్ పై అతి పెద్ద రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 కూడా మంచి రసవత్తరంగానే కొనసాగుతూ వెళుతుంది. గత సీజన్ల లానే ఆసక్తికర టాస్కులు, గేమ్స్ తో ఈ సీజన్ నడుస్తుండగా ఇప్పుడు కొనసాగుతున్న బ్యాలన్స్ హౌస్ మేట్స్ లో కొంతమంది కంటెస్టెంట్స్ కి మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. మరి వారిలో షణ్ముఖ్ జస్వంత్ కూడా ఒకడు.

అయితే వెళ్లడం మంచి ఫేమ్ తోనే వెళ్లినా ఇప్పటి వరకు మాత్రం అంత ఎఫెక్టీవ్ గేమింగ్ మాత్రం చూపించలేదని ఫిజికల్ టాస్కులు పెద్దగా చెయ్యడని ఒక రిమార్క్ ఉంది. కానీ నిన్న జరిగినటువంటి ఎపిసోడ్ లో ఫిజికల్ టాస్క్ ని కంప్లీట్ చేసిన విధానంగా కొంతమేర షో న్యూట్రల్ ఆడియెన్స్ మెప్పించినట్టే అని చెప్పొచ్చు.

కానీ లోబోతో గెలవడంపై అదేమీ పెద్ద కష్టతరమైన పనేమీ కాదని ఇంకో టాక్ కూడా ఉంది. దీనితో షన్ను పెద్దగా కష్టపడకుండానే ఈ టాస్క్ విన్ అయ్యాడని ఇందులో మ్యాజిక్ అయితే ఏమీ లేదని కొంతమంది వాదన. మొత్తానికి అయితే షన్ను పై తన హార్డ్ కోర్ ఫ్యాన్స్ లో తప్ప జెనరల్ ఆడియెన్స్ లో ఇంకా సరైన ఇంప్రెషన్ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు