నందమూరి మోక్షజ్ఞ ను డైరెక్ట్ చేయనున్న ఈ స్టార్ డైరెక్టర్?

నందమూరి మోక్షజ్ఞ ను డైరెక్ట్ చేయనున్న ఈ స్టార్ డైరెక్టర్?

Published on Jul 2, 2024 3:00 AM IST

నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ లాంచ్ కోసం ఆయన అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికీ ఆయన తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టే సూచనలు కనిపించడం లేదు. అయితే ఇప్పుడు బాలయ్య తన కొడుకుని త్వరలో లాంచ్ చేయబోతున్నాడని, అందుకు సంబంధించిన సన్నాహాలు కూడా జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి.

లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, ఈ చిత్రానికి హనుమాన్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించనున్నారు అని సమాచారం. అధికారికంగా ఈ విషయం ధృవీకరించాల్సి ఉన్నప్పటికీ, ఈ వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో వైరల్‌గా మారింది. మరి మోక్షజ్ఞ కోసం ప్రశాంత్ వర్మ ఎలాంటి సినిమా తీస్తాడో చూడాలి. ప్రస్తుతానికి ఈ వార్త అభిమానులను ఉత్కంఠకు గురి చేస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు