ప్రభాస్ ను డైరెక్ట్ చేయనున్న స్టార్ డైరెక్టర్?

Published on Dec 26, 2022 6:11 pm IST


పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ లో బిజీగా ఉన్నారు. టాలీవుడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఒక చిత్రం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు ప్రభాస్. అయితే ప్రభాస్ టాలీవుడ్ సెన్సేషన్ డైరెక్టర్ సుకుమార్ తో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది.

ప్రభాస్ కి డైరెక్టర్ సుకుమార్ ఇప్పటికే ఒక ఐడియా ను వినిపించినట్లు ఇండస్ట్రీ లో టాక్ నడుస్తోంది. ప్రభాస్ కూడా ఫుల్ స్క్రిప్ట్ ను రెడీ చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం సుకుమార్ పుష్ప2 చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత రామ్ చరణ్ తో మరొక చిత్రం చేయనున్నారు. ప్రభాస్ సైతం సలార్ తో పాటుగా ప్రాజెక్ట్ కే ను కూడా ఫినిష్ చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ లు పూర్తి అయ్యాక వీరి చిత్రం మొదలు అయ్యే అవకాశం ఉంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి ఉండాల్సిందే.

సంబంధిత సమాచారం :