“ఇండియన్ 2” లో ఈ స్టార్ హీరోయిన్ కూడా స్టార్ట్ చేస్తుందట.!

“ఇండియన్ 2” లో ఈ స్టార్ హీరోయిన్ కూడా స్టార్ట్ చేస్తుందట.!

Published on Aug 9, 2022 11:04 PM IST

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ హిట్ సినిమా “విక్రమ్” కోసం అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో కమల్ తన కెరీర్ లో భారీ కం బ్యాక్ ఇవ్వగా ఇక నెక్స్ట్ సినిమాల కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ లైనప్ లో విక్రమ్ కన్నా ముందే ఉన్న భారీ చిత్రం “ఇండియన్ 2” కోసం అందరికీ తెలిసిందే. విజనరీ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఇండియన్ ని సీక్వెల్ గా ప్లాన్ చేసిన ఈ భారీ చిత్రం ఎప్పుడో స్టార్ట్ అయ్యింది.

కానీ కొన్ని కారణాల చేత మధ్యలోనే ఆగి ఇప్పుడు స్టార్ట్ అవ్వడానికి రెడీ అయ్యింది. మరి ఈ చిత్రంపై లేటెస్ట్ గా ఇంకో అప్డేట్ కూడా వినిపిస్తుంది. ఈ చిత్రం షూటింగ్ ఈ సెప్టెంబర్ 13 నుంచి చెన్నై లో స్టార్ట్ కానుండగా ఈ షూట్ లో కాజల్ తో పాటుగా మరో స్టార్ హీరోయిన్ కూడా పాల్గొననున్నట్టుగా తెలుస్తుంది. మరి ఆమె ఎవరో కాదు రకుల్ ప్రీత్ సింగ్ అట. ఈమె కూడా ఈ షూట్ లో ఉన్నట్టుగా ఇపుడు తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా లైకా ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు