టాక్..లోకేష్ నెక్స్ట్ కి హీరోయిన్ ఫిక్స్ అయ్యిందా..?

Published on Jun 4, 2022 4:00 pm IST

ఇప్పుడు సౌత్ ఇండియన్ సినిమా దగ్గర గట్టిగా వినిపిస్తున్న మరో దర్శకుడు పేరు లోకేష్ కనగ్ రాజ్. కోలీవుడ్ కి చెందిన ఈ టాలెంటెడ్ దర్శకుడు చేసిన లేటెస్ట్ సినిమా “విక్రమ్” కి సాలిడ్ రిపోర్ట్స్ వస్తుండడంతో పైగా తన సినిమాలకు అంటూ ఒక సినిమాటిక్ యూనివర్స్ చేయడంతో ఆడియెన్స్ లో ఒక రకమైన ఆసక్తి నెలకొంది.

మరి ఈ దర్శకుడు నుంచి వచ్చిన లాస్ట్ మూడు సినిమాలు కూడా డ్రగ్స్ రిలేటెడ్ లో కనిపిస్తాయి. అయితే వాటిలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో చేసిన “మాస్టర్” వేరేగా ఉంటుంది. ఇపుడు మళ్ళీ విజయ్ 167వ సినిమాగా లోకేష్ తో సినిమా కన్ఫర్మ్ అయిన సంగతి తెలిసిందే.

ఇపుడు ఈ క్రేజీ కాంబోలో హీరోయిన్ గా ఎవరు ఫిక్స్ అయ్యారు అనేది తెలుస్తుంది. ఈ చిత్రానికి స్టార్ హీరోయిన్ సమంత పేరు స్ట్రాంగ్ బజ్ లో వినిపిస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది కాలమే నిర్ణయించాలి. అలాగే ఆల్రెడీ అయితే విజయ్ మరియు సమంత ల నుంచి పలు సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :