“గని”లో ఐటెం సాంగ్ కి ఈ స్టార్ హీరోయినేనా..?

Published on Jan 12, 2022 8:01 am IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ సినిమా “గని”. దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న ఈ ఇంట్రెస్టింగ్ చిత్రంపై మంచి అంచనాలు కూడ నెలకొన్నాయి. వరుణ్ తేజ్ నుంచి కంప్లీట్ గా కొత్త సబ్జెక్ట్ అందులోని బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా కావడంతో మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమా నుంచి మేకర్స్ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని రివీల్ చేశారు. ఈ సినిమాలోని ఒక ఐటెం సాంగ్ ఉన్నట్టుగా తెలిపారు. కానీ ఈ సాంగ్ లో కనిపించనున్న హీరోయిన్ ఎవరు అనేది సస్పెన్స్ గా ఉంచారు. అయితే ఈ హీరోయిన్ ఎవరు అనేది కూడా ఇప్పుడు వినిపిస్తుంది.

ఈ స్పెషల్ సాంగ్ కి గాను మేకర్స్ మిల్కీ బ్యూటీ తమన్నా ని దింపినట్టు తెలుస్తుంది. మరి ఇప్పుడు 11 గంటలకి వచ్చే అప్డేట్ లో ఈమె పేరే రివీల్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి వేచి చూడాలి ఈ సాంగ్ లో ఎవరు కనిపిస్తారో అనేది. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా సిద్ధు ముద్ద మరియు అల్లు బాబీ లు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :