బజ్..విజయ్ నెక్స్ట్ లో ఈ స్టార్ హీరోయిన్..?

Published on Sep 29, 2021 7:12 pm IST


ప్రస్తుతం ఇళయ థలపతి విజయ్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో “బీస్ట్” అంటే ఓ సాలిడ్ మాసివ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ఈ సినిమా అనంతరం విజయ్ తెలుగు సినిమాలోకి ఎంట్రీ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాడు. తన గత చిత్రాలతో మంచి మార్కెట్ ఏర్పర్చుకున్న విజయ్ బీస్ట్ అనంతరం దర్శకుడు వంశీ పైడిపల్లితో సినిమా ఓకే చెయ్యగా అది ఇటీవలే అధికారికంగా అనౌన్స్ కూడా అయ్యింది.

మరి దీనిపై మరింత ఆసక్తికర బజ్ వినిపిస్తుంది. ఆల్రెడీ స్టార్ క్యాస్టింగ్ ఈ సినిమాకి సిద్ధం అవుతుండగా విజయ్ సరసన ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ నటించనుంది అని లేటెస్ట్ బజ్ బయటకి వచ్చింది. మరి ఇందులో ఇంకా ఎంతమేర నిజం ఉంది అన్నది తెలియాల్సి ఉంది. ఇక బీస్ట్ సినిమాలో పూజా హెగ్డే నటిస్తుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :