ధనుష్ రెండో తెలుగు ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా ఆమె.?

Published on Jul 29, 2021 3:42 pm IST


కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఇప్పుడు చేస్తున్న అనేక ప్రాజెక్ట్స్ లో తెలుగు నుంచి కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. మొదటగా ధనుష్ మ్యాజికల్ దర్శకుడు శేఖర్ కమ్ములతో ఒక పాన్ ఇండియన్ సినిమా చేస్తుండగా దానితో పాటుగా మరో తెలుగు ప్రాజెక్ట్ కూడా చేయనున్నాడని టాక్ వచ్చింది.

అంతే కాకుండా దానిని సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నట్టుగా నిన్న ధనుష్ బర్త్ డే సందర్భంగా కాస్త క్లారిటీ కూడా వచ్చింది. మరి ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు ఎవరు ఫిక్స్ అయ్యారు అన్నది కూడా టాక్ మొదలయ్యిపోయింది.

మరి దానితో ఈ చిత్రంలో ధనుష్ సరసన స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే నటించనున్నట్టుగా టాక్. దీనిపై ఎంత మేర నిజముందో కాలమే నిర్ణయించాలి. అలాగే ఈ సినిమాకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించనున్నాడని బజ్ ఉంది. మరి వీటన్నిటిపైనా అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :