మహేష్ తో యాక్ట్ చెయ్యాలి అంటున్న స్టార్ హీరోయిన్.!

Published on Jun 21, 2022 10:00 pm IST

టాలీవుడ్ లో ఉన్నటువంటి ఆల్ టైం హ్యాండ్సమ్ హీరోలలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒకరు. లేడీ ఫాలోయింగ్ లో గాని ఇండస్ట్రీకి చెందిన వారిలో గాని మహేష్ కి మంచి క్రేజ్ ఉంది. అయితే ఇలాంటి హీరోతో మరి ఏ హీరోయిన్ గాని నటులు గాని నటించాలని కోరుకోరు? ఇప్పుడు ఆ లిస్ట్ లోకే టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా కూడా జాయిన్ అయ్యింది.

తాజాగా అయితే ఆమె హీరోయిన్ గా నటించిన “పక్కా కమర్షియల్” చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా రాశీ మాట్లాడుతూ తాను సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించే ఛాన్స్ కోసం కోరుకుంటున్నానని మహేష్ తో యాక్ట్ చెయ్యాలని కోరుకుంటున్నట్టుగా బయటపెట్టింది. మరి ఆమెకి ముందు రోజుల్లో ఏమన్నా ఈ లక్కీ ఛాన్స్ వస్తుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం :