ఆస్కార్స్ లో ప్రెజెంటర్ గా ఇండియా నుంచి స్టార్ హీరోయిన్.!

Published on Mar 3, 2023 9:00 am IST

ప్రస్తుతం ఒక్క ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా మన ఇండియన్ సినిమా ఆడియెన్స్ లో కూడా ప్రపంచ ప్రఖ్యాత అవార్డ్స్ ఆస్కార్ 2023 ఈవెంట్ కోసం అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే మన దేశం నుంచి పలు విభాగాల్లో ఓ సినిమా డాక్యుమెంటరీ అలాగే మన టాలీవుడ్ నుంచి భారీ చిత్రం “రౌద్రం రణం రుధిరం” నుంచి నాటు నాటు సాంగ్ ఎంపిక అయ్యిన సంగతి తెలిసిందే.

అందుకే ఈసారి ఆస్కార్ వేడుక మన భారతీయ సినిమా దగ్గర ప్రతిష్టాత్మకంగా నిలిచింది. అయితే ఈ ప్రిస్టేజియస్ ఈవెంట్ లో అవార్డ్స్ ప్రెజెంటర్ లుగా అనేక మంది ప్రముఖులు కనిపిస్తారని తెలిసిందే. మరి వారందరిలో కూడా మన ఇండియన్ సినిమా నుంచి ప్రముఖ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె చోటు దక్కించుకోవడం మరో ప్రౌడ్ మూమెంట్ గా అయితే నిలిచింది. దీనితో దీపికా ఈ అంశంలో ఆనందం వ్యక్తం చేస్తుంది. ఇక ఈ ఈవెంట్ అయితే ఈ మార్చ్ 12న జరగనుంది.

సంబంధిత సమాచారం :