ఇంట్రెస్టింగ్..మాస్ మహరాజ్ సినిమాలో ఈ కోలీవుడ్ స్టార్ నటుడు..?

Published on Jan 8, 2022 7:07 am IST

ప్రస్తుతం మన టాలీవుడ్ మాస్ మహరాజ్ రవితేజ పలు ఆసక్తికరమైన ప్రాజెక్ట్ లలో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. తన మాస్ హిట్ “క్రాక్” తర్వాత సాలిడ్ లైనప్ ని రవితేజ సెట్ చేశారు. ఇక ఇదిలా ఉండగా మాస్ మహరాజ్ చేస్తున్న ఓ సినిమాలో కోలీవుడ్ స్టార్ నటుడు అయినటువంటి విష్ణు విశాల్ ఒక కీలక పాత్ర పోషించనున్నాడని టాక్ ఇప్పుడు మొదలైంది.

అయితే ఇది రవితేజ చేస్తున్న మొట్ట మొదటి పాన్ ఇండియా సినిమా “టైగర్ నాగేశ్వరరావు” కోసం అన్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా వీరి ఫోటో కూడా బయటకు రాగా అది ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. మరి వేచి చూడాలి. నిజంగా ఈ సినిమాలో విష్ణు విశాల్ ఉన్నాడో లేదో అనేది. ప్రస్తుతానికి అయితే ఈ టాక్ తో సినిమా పై మరింత ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :