“ఎన్టీఆర్ 30” లో వారు ఆల్ మోస్ట్ ఫిక్స్.!

Published on Feb 15, 2023 11:06 am IST

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివతో ఓ సెన్సేషనల్ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై అనేక అంచనాలు నెలకొనగా మేకర్స్ అయితే ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో చేస్తున్నారు. ఇక మరొకొన్ని రోజుల్లో సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యిపోనుండగా ఈ సినిమాపై అయితే గత కొన్ని రోజులు నుంచి ఇంట్రెస్టింగ్ రూమర్స్ బయటకి వచ్చాయి.

మరి వాటిలో హీరోయిన్ మరియు విలన్ కి సంబంధించి పలు సాలిడ్ అప్డేట్స్ వినిపించాయి. మరి ఇప్పుడు ఈ రూమర్స్ ఆల్ మోస్ట్ నిజం అన్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా అయితే జాన్వీ జాపూర్ కన్ఫర్మ్ కాగా విలన్ గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఫైనల్ అయ్యినట్టుగా తెలుస్తుంది. దీనితో అయితే ప్రస్తుతం ఈ ఇద్దరి పేర్లు ఆల్ మోస్ట్ ఫిక్స్ అయ్యిపోయినట్టే అని చెప్పాలి. ఇక వీటిపై అధికార అనౌన్సమెంట్ లు మాత్రమే రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :