బిగ్ బాస్ 5 – హీటెక్కించే ఎలిమెంట్స్ తో ఈ వారం సండే.!

Published on Nov 14, 2021 5:00 pm IST


ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 మంచి రసవత్తరంగా సాగుతుంది. ముందు సీజన్ల లానే ఆసక్తికర మైండ్ గేమ్స్ ఎలిమినేషన్స్ ఇతర హంగులతో షో కి కావాల్సిన స్పైసీ కంటెంట్ అంతా కూడా దక్కుతుంది. అయితే అన్ని వారాంతాలు లానే ఈ వారం కూడా ఉంటుంది అని అంతా అనుకున్నారు. కానీ నిన్న శనివారం ఒక రకంగా ఇప్పుడు ఆదివారం ది బిగ్ డే ఇంకో రకంగా ఉండబోతుంది అని అర్ధం అవుతుంది. లేటెస్ట్ ప్రోమో లో చూస్తే ఇదే క్లియర్ అవుతుంది.

నాగ్ ఎంట్రీ ఇవ్వడంతోనే బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి ఈరోజు సండే ఫన్ డే కాదు హీట్ ఎక్కించే డే అని చెప్పేసాడు. ఇక అలా చెప్పడంతోనే ఈ ప్రోమో కూడా అదే తీరులో హీటెక్కించే విధంగానే ఉందని చెప్పాలి. ఒకరి మీద ఒకరు తమ వెర్షన్స్ చెప్పుకోవడం నుంచి లాస్ట్ మినిట్ ఎలిమినేషన్ వరకు మంచి రసవత్తరంగా కనిపిస్తోంది. మరి ఈ డిఫరెంట్ సండే ఎపిసోడ్ ఎలా ఉంటుంది అనేది తెలియాలి అంటే స్టార్ మా లో ఈ రోజు రాత్రి 9 గంటలకి ఈ ఎపిసోడ్ చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :

More