‘బాలయ్య 111’ లో పవర్ఫుల్ రోల్ కోసం ఆమె?

NBK 111

ప్రస్తుతం నటసింహం బాలకృష్ణ తన 111వ సినిమా కోసం సన్నద్ధం అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి ముందు వచ్చిన అఖండ 2 అనుకున్న రేంజ్ సక్సెస్ కాలేదు. దీనితో ఇప్పుడు చేస్తున్న 111వ సినిమా కోసం మాత్రం చాలా కేర్ తీసుకుంటున్నారు. కొంచెం ఆలస్యం అయినా కూడా దీనిపై మరింత కేర్ తీసుకుంటుండగా ఈ సినిమా విషయంలో దర్శకుడు గోపిచం మలినేని ఇచ్చిన ఓ స్టేట్మెంట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

తన ప్రతీ సినిమాలో ఒక కీలక పాత్ర చేసే లేడీ ఉంటుంది అని అలానే ఇప్పుడు చేస్తున్న సినిమాకి కూడా ఉందని వరలక్ష్మి శరత్ కుమార్ చేసిన సరస్వతి సినిమా ట్రైలర్ లాంచ్ లో తెలిపారు. దీనితో ఈ రోల్ కి కూడా వరలక్ష్మి శరత్ కుమార్ నే చేస్తున్నారని అభిమానులు ఫిక్స్ అయ్యారు. ఇది వరకే వీర సింహా రెడ్డి అలాగే క్రాక్ సినిమాల్లో ఆమెకి ఎలాంటి రోల్స్ పడ్డాయో తెలిసిందే. ఇప్పుడు తాను అఫీషియల్ గా ఆమె పేరు చెప్పలేదు కానీ ఎవరు చేస్తారో చూద్దాం అంటూ హింట్ ఇవ్వడం జరిగింది. సో దీనిపై అధికారిక క్లారిటీ కోసం ఆగాల్సిందే.

Exit mobile version