క్రేజీ బజ్..ఈ డైరెక్టర్ తో యష్.?

Published on Feb 11, 2023 11:00 am IST

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన తన లాస్ట్ బిగ్గెస్ట్ హిట్ “కేజీయఫ్ చాప్టర్ 2” చిత్రం తో ఇండియా వైడ్ టాప్ గ్రాసింగ్ సినిమాల్లో ఒకటిగా నిలిపాడు. అయితే యష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు ఎవరితో ఉంటుంది అనే అంశాలు బాగా ఆసక్తిగా మారగా దీనికి నిర్మాత అయితే ఓకే అయ్యారు కానీ ఇంకా దర్శకుడు ఎవరు అనేది మాత్రం ఇంకా ఫైనల్ కాలేదు. దీనితో యష్ ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ ని ఎవరు డైరెక్ట్ చేస్తారు అనే దానిపై లేటెస్ట్ గా ఇంట్రెస్టింగ్ రూమర్స్ వినిపిస్తున్నాయి.

అయితే తమిళ్ దర్శకుడితో యష్ వర్క్ చేసే ఛాన్స్ ఉందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఇప్పుడు దీనికి అనుగుణంగా తమిళ టాలెంటెడ్ దర్శకుడు పి ఎస్ మిత్రన్ అభిమన్యుడు, లేటెస్ట్ గా సర్దార్ ఫేమ్ వర్క్ చేయనున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇది కూడా భారీ పాన్ ఇండియా సినిమా అన్నట్టు తెలుస్తుంది. అయితే ఇది యష్ 19 సినిమాకేనా లేక వేరే ప్రాజెక్ట్ కోసమా అనేది మాత్రం కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :