టాక్..తలైవర్ లైనప్ లోకి ఈ టాలెంటెడ్ దర్శకుడు కూడా?

Published on Dec 24, 2021 8:05 pm IST

కోలీవుడ్ సూపర్ స్టార్, తలైవర్ రజినీకాంత్ ప్రస్తుతం తన “అన్నాత్తే” సినిమా తర్వాత కొత్త సినిమాలు లైన్ లో పెట్టే పనిలో ఉన్నారు. అయితే ఈ సినిమా సక్సెస్ ఏమో కానీ రజినీ మాత్రం మళ్ళీ దర్శకుడు శివ కి అవకాశం ఇవ్వనున్నారని టాక్ ఉండగా అతనితో పాటు మరికొందరు దర్శకులు పేర్లు రజినీ లైనప్ కోసం వినిపిస్తున్నాయి.

మరి రీసెంట్ గానే కార్తీక్ సుబ్బరాజ్ మరియు బల్కి పేర్లు యాడ్ అవ్వగా ఇప్పుడు ఇంకో టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ పేరు వచ్చినట్టు తెలుస్తుంది. అతడు మరెవరో ఈ ఏడాది కోలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మరో బిగ్ హిట్ ఇచ్చిన దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. తన “డాక్టర్” సినిమాతో తమిళ్ లోనే కాకుండా మన తెలుగు సినిమాలో కూడా సాలిడ్ హిట్ అందుకున్నాడు.

ఇప్పుడు కోలీవుడ్ మరి బిగ్ స్టార్ థలపతి విజయ్ తో “బీస్ట్” సినిమా చేసాడు. ఇక దీని తర్వాత తలైవర్ సినిమా కోసం ఇతడి పేరు కూడా వచ్చినట్టు టాక్ వినిపిస్తుంది. కార్తీక్ సుబ్బరాజ్ కంటే ఈ దర్శకుడితో సౌండింగ్ కొంచెం ప్రామిసింగ్ గా ఉంది. మరి రజినీ ఏ దర్శకునికి అవకాశం ఇస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :