ప్రభాస్ వరల్డ్ ప్రాజెక్ట్ లో ఈ టాలెంట్ ఉన్నవారికి అవకాశం..!

Published on Apr 22, 2022 7:03 am IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి ఇప్పుడు స్ట్రాంగ్ కం బ్యాక్ కోసం అభిమానులు చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ కం బ్యాక్ అయితే ఏమో గాని తన నుంచి రాబోయే సినిమాలపై మాత్రం అభిమానులు మినిమం నమ్మకంతో ఉన్నారు. ఇక వీటిలో పాన్ ఇండియా పాన్ ఆసియా స్థాయిలో సినిమాలు కూడా ఉన్నాయి కానీ ఈ భారీ లైనప్ లో దర్శకుడు నాగ్ అశ్విన్ తో ప్లాన్ చేసిన వరల్డ్ లెవెల్ సినిమా ఒకటి ఉంది. ప్రస్తుతం “ప్రాజెక్ట్ కే” గా పిలుస్తున్న ఈ సినిమాలో చిత్ర యూనిట్ దాదాపు ఇండియన్ కాస్ట్ నే తీసుకుంటున్నారు.

టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికీ అవకాశం ఇచ్చే విధంగా ఎన్నో ఆడిషన్స్ పెట్టిన చిత్ర బృందం తాజా మరో టాలెంట్ ఉన్న వారికి అవకాశం ఇస్తున్నారు. ఈసారి తాము మంచి8 స్టంట్స్ వచ్చిన నటుల కోసం చూస్తున్నామని తెలిపారు. భారతీయ కళతో పాటు ఇతర మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం ఉన్నవారు గాని లేదా ఆసక్తి ఉన్నవారు ఎవరైనా సరే తమ టాలెంట్ చూపించి ఈ భారీ సినిమాలో అవకాశం దక్కించుకోవచ్చని తెలిపారు. మరి మీలో కూడా ఆ ప్రతిభ ఉంటే వారు ఇచ్చిన మెయిల్ ద్వారా సంప్రదించి ఈ ఆఫర్ ను వినియోగించుకోవచ్చు.

సంబంధిత సమాచారం :