“అవతార్ 2” కి ఈ యంగ్ డైరెక్టర్ డైలాగ్స్.!

Published on Dec 13, 2022 3:00 pm IST

హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కేమరూన్ అద్భుత సృష్టి లలో ఒకటైనటువంటి చిత్రం “అవతార్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం తర్వాత తన నుంచి వస్తున్న దీని సీక్వెల్ “అవతార్ ది వే ఆఫ్ వాటర్” ఈ వారం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. మరి అనేక అంచనాలు ఉన్న ఈ చిత్రం పట్ల ఇండియాలో కూడా విడుదల అవుతున్న అన్ని భాషల్లో కూడా మంచి అంచనాలు నెలకొనగా మన తెలుగులో కూడా ఈ చిత్రంపై ఆడియెన్స్ చాలా ఆసక్తిగా ఉన్నారు.

ఇప్పటికే సాలిడ్ బుకింగ్స్ అందుకుంటున్న ఈ చిత్రం తెలుగు వెర్షన్ పై అయితే ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇపుడు బయటకొచ్చింది. ఈ చిత్రానికి గాను తెలుగులో అయితే ప్రముఖ టాలెంటెడ్ అండ్ యంగ్ డైరెక్టర్ కమ్ హీరో, రచయిత అవసరాల శ్రీనివాస్ అయితే డైలాగ్స్ అందించినట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. తన డైలాగ్స్ ఎలా ఉంటాయో ఆల్రెడీ తెలిసిందే. మరి అవతార్ 2 లాంటి సినిమాలో అవి ఎలా ఉంటాయో చూడాలి.

సంబంధిత సమాచారం :