“బిగ్ బాస్ ఓటిటి” విన్నర్ బిందుకి తమిళ యంగ్ బ్యూటీ కంగ్రాట్స్.!

Published on May 22, 2022 6:00 pm IST

మన తెలుగు బుల్లితెర దగ్గర పెద్ద హిట్ అయినటువంటి గ్రాండ్ రియాలిటీ షో “బిగ్ బాస్” ఒక్క మన తెలుగులోనే కాకుండా ఇండియన్ టెలివిజన్ దగ్గర మన తెలుగు బిగ్ బాస్ షో నే భారీ టీఆర్పీ తో హిట్ అయ్యింది. దీనితో దానికి సక్సెసర్ గా ఫస్ట్ టైం ఓటిటి లో బిగ్ బాస్ షో ని తీసుకొచ్చారు.

మరి ఈ వెర్షన్ లో కూడా బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ కంప్లీట్ అయ్యిపోయింది. భారీ సస్పెన్స్ నడుమ నిన్నటి ఎపిసోడ్ తో అఖిల్ సార్థక్ మరియు బిందు మాధవిల మధ్య గట్టి పోటీలో బిందు మాధవి టైటిల్ విన్నర్ గా నిలిచి తెలుగు బిగ్ బాస్ హిస్టరీ లో ఫస్ట్ ఫీమేల్ కంటెస్టెంట్ గా నిలిచింది.

అయితే ఈ యంగ్ యాక్ట్రెస్ కి తమిళ మరో యంగ్ బ్యూటీ అయినటువంటి అతుల్య రవి స్పెషల్ కంగ్రాట్స్ తెలిపింది. ఆమెకి కంగ్రాట్స్ తెలుపుతూ నువ్ అనుకున్నది సాధించావ్, ఇలాగే కొనసాగు అంటూ ట్వీట్ చేసింది. దీనితో ఈ ట్వీట్ మంచి వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం :