హాలీవుడ్ లోకి తెలుగు తేజం..మోడీ నుంచి శుభాకాంక్షలు.!

హాలీవుడ్ లోకి తెలుగు తేజం..మోడీ నుంచి శుభాకాంక్షలు.!

Published on Oct 24, 2021 3:35 PM IST

స్టడీస్ పరంగా ఇంజినీరింగ్ టాపర్ గా నిలిచి, ‘న్యూయార్క్ ఫిల్మ్ అకాడమి’లో శిక్షణ పొంది… సంచలన దర్శకుడు మారుతి దర్శకత్వంలో రూపొంది, మంచి విజయం సాధించిన “భద్రం బికేర్ ఫుల్ బ్రదర్” చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన తెలుగు తేజం రాజ్ దాసిరెడ్డి తాజాగా హాలీవుడ్ కి హలొ చెబుతున్నాడు.

ఇందుకు సంబంధించిన వివరాలు త్వరలో అధికారికంగా వెలువడనున్నాయి ఇటీవల సైమా అవార్డ్స్ లో పాల్గొనడం చాలా సంతోషాన్నిచ్చిందంటున్న రాజ్ దాసిరెడ్డి… మన తెలుగువారంతా గర్వపడేలా హాలీవుడ్ లో తన కెరీర్ తీర్చిదిద్దుకుంటానని, తెలుగులోనూ కొన్ని చిత్రాల కోసం చర్చలు జరుగుతున్నాయని చెబుతున్నాడు.

అలాగే ముఖ్యంగా నేడు జన్మదినం జరుపుకుంటున్న రాజ్ ఏకంగా మన దేశ ప్రధాని నరేంద్రమోడీ నుంచి శుభాకాంక్షలు రావడం విశేషం కాగా మోడీ నుంచి బ్లెస్సింగ్స్ అందుకోవడం చాలా గర్వంగా ఉందని అంటున్నాడు. ఈ తెలుగు తేజం హాలీవుడ్ లోనూ విజయకేతనం ఎగురవేయాలని కోరుకుందాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు