ఆ మూడు సినిమాలు బన్నీ హవాని తట్టుకుంటాయా ?

29th, June 2017 - 01:44:04 PM


అల్లు అర్జున్ తాజా చిత్రం ‘దువ్వాడ జగన్నాథమ్’ గత శుక్రవారం విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్రహ్మాండమైన కలెక్షన్లను రాబడుతోంది. ఇప్పటికే బన్నీ కెరీర్లోనే అత్యధిక స్థాయి వసూళ్లను రాబట్టిన ఈ సినిమా లాంగ్ రన్లో భారీ మొత్తాన్ని ఖాతాలో వేసుకునే దిశగా సాగుతోంది. ఇదిలా ఉండగా రేపు శుక్రవారం మూడు సినిమాలు రిలీజవుతున్నాయి. వాటిలో మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడు గంటా రవి, జయంత్.సి.పరాంజీ కాంబోలో రూపొందిన ‘జయదేవ్’ ఒకటి కాగా సంపూర్ణేష్ బాబు ‘వైరస్’ రెండవది.

ఈ రెండు సినిమాలు కొంచెం పర్లేదనే స్థాయి పబ్లిసిటీతో రిలీజవుతుండగా మరొక చిన్న చిత్రం ‘ఖయ్యూం భాయ్’ కూడా రేపే థియేటర్లలోకి దిగుతోంది. మరి ఎలాంటి అంచనాలు, ఆర్భాటాలు లేకుండా విడుదలవుతున్న ఈ మూడు సినిమాలు మంచి టాక్ తో నడుస్తున్న ‘డీజే’ నుండి గట్టి పోటీని ఎదుర్కొవాల్సి ఉంటుంది. మరి ఈ సినిమాలు బన్నీ హవా ముందు ఏ మేరకు నిలబడతాయో చూడాలి.