ఈసారి ‘క్లాస్ అఫ్ ఎయిటీస్’ పార్టీ చిరు ఇంట్లో…!

chiru1

సౌత్ చిత్ర పరిశ్రమల నుండి 80 మరియు 90 దశకాలలో విరివిగా సినిమాలు చేసి, ప్రతిభావంతులైన నటులుగా గుర్తింపు పొందిన నటులు ‘క్లాస్ అఫ్ ఎయిటీస్’ పేరుతో ఒక క్లబ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తెలుగు,తమిళ, కన్నడ, మలయాళ పరిశ్రమలోని నటీనటులు ఈ క్లబ్ లో సభ్యులుగా ఉన్నారు. చిరంజీవి, రజిని కాంత్,వెంకటేష్, మోహన్ లాల్,బాలకృష్ణ,భాను చందర్,అర్జున్,సుమన్, రాధికా, సుహాసినీ, సుమలత, కుష్బూ ఇంకా అనేకమంది ప్రతి సంవత్సరం ఒక ప్రదేశంలో కలిసి వేడుకలా జరుపుకుంటారు. కొన్నేళ్లుగా ఈ ఆనవాయితీ వారు కొనసాగిస్తున్నారు.

కాగా త్వరలో జరగనున్న ఈ పార్టీకి ఈ సారి మెగాస్టార్ చిరంజీవి ఆతిథ్యం ఇవ్వాలని కోరుకుంటున్నారట. ఆయన కొత్తగా రీమోడలింగ్ చేయించిన ఇంటిలో వివిధ పరిశ్రమలకు చెందిన తమ క్లబ్ మెంబర్స్ ఆహ్వానించి గ్రాండ్ గా సెలెబ్రేట్ చేయనున్నారని సమాచారం. ఇక ఆయన తాజాగా నటించిన సైరా నరసింహారెడ్డి తెలుగు రాష్ట్రాలలో ఘనవిజయం అందుకుంది. దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ లో నిర్మించారు.

Exit mobile version