“చరణ్ 15” ఈసారి మాత్రం మిస్సవ్వదా?

“చరణ్ 15” ఈసారి మాత్రం మిస్సవ్వదా?

Published on Feb 6, 2023 11:20 PM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం కోసం తెలిసిందే. చరణ్ మరియు శంకర్ ల కెరీర్ లో ఇది 15వ సినిమా కాగా ఈ సినిమాపై పాన్ ఇండియా వైడ్ భారీ హైప్ కూడా ఉంది. అయితే ఈ సినిమా షూటింగ్ చాలా పకట్బందీ గా జరుగుతుంది కానీ కొన్ని లీకులు అయితే బయటకి వచ్చాయి కానీ సినిమా నుంచి అధికారిక అప్డేట్స్ మాత్రం లిమిటెడ్ గానే ఉన్నాయి.

దీనితో ఈ భారీ సినిమా ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సారి చరణ్ బర్త్ డే ట్రీట్ గా మాత్రం ఖచ్చితంగా రావచ్చని గట్టి బజ్ వినిపిస్తుంది. దీనితో ఇది ఆల్ మోస్ట్ నిజమే అన్నట్టుగా ఇప్పుడు లేటెస్ట్ సమాచారం. దీనిపై తమిళ సినీ వర్గాల నుంచి కూడా నిజమే అన్నట్టుగా వినిపిస్తుంది. దీనితో మార్చ్ లో మాత్రం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆ అవైటెడ్ ట్రీట్ రావడం ఖాయం అని చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు